దానికోసం ఏకంగా 465 సార్లు పెళ్లికూతురుగా మారిన ప్రముఖ నటి..!!

-

ఈ మధ్యకాలంలో రాణి ముఖర్జీ పెళ్లి చూపుల ఫోటోలను షేర్ చేసి అభిమానులను విపరీతంగా ఆశ్చర్యపరచిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పుడు ఈమె పెళ్లి చూపులే ఇండస్ట్రీలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేసింది రాణి చటర్జీ.. నిజానికి ఈమె ఒక భోజపురి నటి ఖత్రోంకి కిలాడి ఫేమ్.. ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను తనదైన స్టైల్ లో అలరిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఈమె అందం ప్రతిభతో మిస్ కోల్కతాగా కూడా నిలిచింది. మొదటిసారి 2003లో మనోజ్ తివారి సూపర్ హిట్ చిత్రమైన ససురా బడా పైసావాలా సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది.

ఇక ఆ తర్వాత సల్మాన్ ఖాన్ గ్రేటెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 16 లో భాగం కావాలని రాణి చటర్జీని కోరగా ఆమె నిరాకరించింది. ఇకపోతే ఇటీవల ఈమె పెళ్లిచూపులు నెట్టింట విపరీతంగా సందడి చేస్తోంది. ఇటీవల ఆమె షేర్ చేసుకున్న ఫోటోలు పెళ్లికూతురు గెటప్ లో చాలా అందంగా కనిపిస్తోంది రాణి చటర్జీ. ఫోటోలను షేర్ చేస్తూ.. సినిమాల సంఖ్య దాటడంతో వధువుగా మారే సంఖ్య కూడా 465కు చేరుకుంది. ఇక బీహార్లో రాబోయే చిత్రం గ్యాంగ్ స్టర్ లో కూడా నేను మళ్లీ పెళ్లికూతురుగా మారిపోతున్నాను అంటూ తన క్యాప్షన్ లో రాసుకొచ్చింది.

అలా సినిమాలలో తన పాత్ర కోసం ఏకంగా 465 సార్లు పెళ్లికూతురు గెటప్ వేసింది రాణి చటర్జీ. ఇక ఈమె ప్రతి లుక్కు, స్టైల్ తన అభిమానులను పిచ్చెక్కేలా చేస్తుందని చెప్పవచ్చు ఇక ప్రస్తుతం రాణి ఈ దుస్తుల్లో దేవకన్యలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version