కావాలని కరోనా అంటించుకున్న పాపులర్‌ సింగర్..

-

కరోనా వైరస్‌ అంటే ఎవరైనా వామ్మో అంటారు.. చుట్టుపక్కల వారికి వచ్చిందంటేనే అటుసైడ్‌ వెళ్లం.. అలాంటిది పాపులర్‌ సింగర్‌ కావాలని కరోనా అంటించుకుంది.. కారణం తెలిస్తే షాక్‌ మీరు కచ్చితంగా షాక్‌ అవుతారు. 38 ఏళ్ల పాపులర్ చైనీస్ గాయని, పాటల రచయిత జేన్ జాంగ్(Jane Zhang)ఉద్దేశపూర్వకంగా తనకు కరోనా వైరస్ సోకేలా చేసుకున్నట్లు తెలిపింది. ఆమె స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
BF.7 ఒమిక్రాన్ వేరియంట్‌తో చైనాలో కేసులలో భారీగా పెరుగుతున్న సమయంలో ఆమె ఉద్దేశ్యపూర్వకంగా కరోనా బారిన పడటం తీవ్ర విమర్శలకు లేవనెత్తుతుంది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన స్నేహితులను ఉద్దేశపూర్వకంగా చూడటం ద్వారా తనకు కరోనావైరస్ సోకినట్లు జేన్ జాంగ్ సోషల్ మీడియాలో తెలిపింది. అయితే దీని వెనుక ఉన్న కారణాన్ని ఆమె వెల్లడించింది. రాబోయే నూతన సంవత్సర వేడుకల కచేరీకి సన్నద్దమ్యే ప్రక్రియలో భాగంగానే వైరస్‌ అంటుకునేలా చేసుకున్నానని, ఇప్పుడే వైరస్ సోకి కోలుకోవడం ద్వారా న్యూఇయర్ ఈవెంట్‌లో మళ్లీ వైరస్ సోకే ప్రమాదం ఉండదని భావించినట్లు ఆమె తెలిపింది. మీరు చదివిందే నిజమే.. కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ..!
న్యూఇయర్ ఈవెంట్‌లో తన ఆరోగ్యం దెబ్బతింటే అది తన ప్రదర్శనపై ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన చెంది.. అందుకే కోవిడ్ సోకిన వారితో కలిశానని ఇప్పుడు కోలుకునేందుకు తగిన సమయం ఉందని జేన్ జాంగ్ సోషల్ మీడియాలో తెలిపింది. తనకు ఒక రోజు మాత్రమే కోవిడ్ లక్షణాలు జ్వరం, గొంతు నొప్పి,బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు కనిపించాయని, తర్వాత మామూలుగానే ఉన్నట్లు ఆమె తెలిపారు. ఒక పగలు, రాత్రి పడుకున్న తర్వాత తన కోవిడ్ లక్షణాలన్నీ మాయమయ్యాయని తెలిపింది.
కోలుకోవడానికి ముందు ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా తాను ఎక్కువగా నీరు తాగానని, విటమిన్ సి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ వైరల్ అయినప్పటి నుండి చాలా మంది ఆమె బాధ్యతారహితమైన ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చైనా కోవిడ్ -19 ఉప్పెనను ఎదుర్కొంటున్న సమయంలో ఆమె చర్యలు మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని నెటిజన్లు మండిపడటంతో.. ఆమె సోషల్ మీడియా నుండి పోస్ట్‌ను తొలగించి ప్రజలకు క్షమాపణలు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version