విమానాలు గాల్లో ఎగురుతున్నప్పుడు ఒక్కోసారి ఇంజిన్‌లోకి పక్షులు వెళ్తుంటాయి. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి.అయితే, తాజాగా విమానం ఇంజన్‌లోకి ఓ కుందేలు వెళ్లింది. దీంతో ఇంజిన్‌లో మంటలు రావడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలెట్లు.
రన్ వేపై విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ప్రమాదవశాత్తు ఇంజన్‌లోకి కుందేలు వెళ్లినట్లు సమాచారం. అమెరికాలోని డెన్వర్ నుండి ఎడ్మింటన్‌కు వెళ్తున్న విమానంలో ప్రమాదం సంభవించగా.. మంటలు చెలరేగడం గుర్తించిన పైలెట్.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.దీంతో పెనుప్రమాదం తప్పిడంతో ప్యాసింజర్స్ ఊపిరి పీల్చుకున్నారు.