ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ తహశీల్దార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ఖండించింది. ఇసుక అనుమతుల విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న జీవో నంబర్ 3, జీవో నంబర్ 15 ప్రకారం మాత్రమే తమకు పర్మిషన్ ఇచ్చే అధికారం ఉందని చెప్పారు.ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన ఉద్యోగ సంఘాలు..ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలంటే అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని అప్పుడే సాధ్యం అవుతుందని వారన్నారు.
తమకు ప్రస్తుతం సిబ్బంది తక్కువగా ఉన్నారని..అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకే టైం సరిపోవడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ విప్ చేసిన వ్యాఖ్యలు రెవెన్యూ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిసేలా ఉన్నాయన్నారు.భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా, డోర్నకల్‌కు వచ్చిన విప్ ఎమ్మార్వోను ఇడియట్ లా మాట్లాడకు అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.