ఒక పుస్తకం దాదాపు 3 దశాబ్దాల తరువాత ఆ ఇద్దరూ తోడళ్లులను కలిపింది. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుల్లు అయినటువంటి సీఎం చంద్రబాబు, దగ్గబాటి వెంకటేశ్వరరావులు చాలా ఏళ్ల తరువాత కలుసుకున్నారు. తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి దగ్గుబాటి వేంకటేశ్వరరావు తన తోడల్లుడైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని స్వయంగా ఆహ్వానించారు. చంద్రబాబును ఆయన నివాసంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిశారు.
ఆయన రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబు ఆహ్వానించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండవల్లిలో తొలిసారి సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు. చాలా కాలం తరువాత ఇద్దరు తోడల్లుళ్లు కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పుస్తకావిష్కరణకు చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. మార్చి 06న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.