జ్ఞాపకాలు గుర్తు చేస్తూ షర్మిల లేఖలు…?

-

తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఏప్రిల్ 9న ఒక స్పష్టత రానుంది. ఏప్రిల్ 9న ఆమె ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు భారీగా జనసమీకరణ కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారిని ఆమె ఆహ్వానించినట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది వైఎస్ అభిమానులకు ఆమె లేఖ రాసినట్లు సమాచారం. అలాగే ఆహ్వాన పత్రాలను కూడా వాళ్లకు అందించినట్లు తెలుస్తుంది. ఖమ్మం సభకు సంబంధించి భారీ ఆలోచనలతో ముందుకు వెళుతున్నా అని దీనిని విజయవంతం చేయాలి అని కోరారట. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు అందరూ కూడా కలిసి రావాలని ఇది ఒక ప్రభంజనం గా ఉండాలి అని షర్మిల కోరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆమె దూకుడుగా అడుగులు వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకు కూడా ఆమె లేఖ రాసినట్లు తెలుస్తోంది. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధాలు నెమరువేసుకుంటూ ఈ లేఖలు రాస్తున్నారు. మీరు సభకు రావాల్సిందిగా ఆమె కాస్త గట్టిగానే అడుగుతున్నట్లు సమాచారం. మరి వాళ్ళు వస్తారా లేదా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంత మంది నేతలు కూడా ఖమ్మంలో ఆమె వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version