కేరళలో మూడు పల్టీలు కొట్టిన స్కూల్ బస్సు..విద్యార్థి మృతి

-

కేరళ రాష్ట్రంలో కొత్త సంవత్సరం రోజున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. బస్సు మూడు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

స్కూల్ బస్సు పల్టీలు కొట్టిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్ బస్సు బోల్తా కొట్టడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. చిన్న గల్లీలో అతివేగంగా బస్సు నడపడమే అందుకు కారణంగా పోలీసులు నిర్దారించారు. పక్కన చిన్న కాలువ ఉండటంతో అందులో పడి లేచి మరోసారి బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. లేదంటే మరికొందరి పరిస్థితి విషమంగా ఉండేదని వైద్యులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version