మన్యం జిల్లాలో ఫ్లెక్సీల లొల్లి..టీడీపీ వర్సెస్‌ పుష్పశ్రీవాణి !

-

పార్వతీపురం మన్యం జిల్లా ఫ్లెక్సీల లొల్లి కలకలం రేపింది. కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఫ్లెక్సీల లొల్లి తెరపైకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ శ్రేణులు. అయితే… మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు ఫ్లెక్సీలను చించేశారు కొందరు అఘంతకులు.

Puspasrivani and Manyam District YCP President Parikshit Raju tore the flexi

అధికారంలో లేకపోయినా ప్రజల్లో ఉంటున్నామనే అక్కసుతోనే కూటమి నేతలు గుంటనక్క చర్యలు చేస్తున్నారని మండిపడుతున్నాయి వైసీపీ శ్రేణులు. కూటమినేతల అహంకారానికి కాలమే సరైన సమాధానం చెప్తుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు వైసీపీ శ్రేణులు. కురుపాం నియోజకవర్గంలో ఎన్నడూ ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చూడలేదంటూ ముక్కున వేలేసుకుని చూస్తున్నారు కురుపాం ప్రజలు. మరి దీనిపై కూటమి నేతలు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version