కూతురి పెళ్లి చేసి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

-

కూతురికి పెళ్లి చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెళ్లి కూతురి తండ్రి మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. శంషాబాద్ పీఎస్ పరిధిలోని పెద్ద షాపూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం..కూకట్‌పల్లి వాసి పెద్ద రాజుల రామచంద్రయ్య, అతని కొడుకు భాస్కర్, బంధువులు పద్మ అలివేలుతో కలిసి కారులో కూతురు వివాహం కోసం వనపర్తి జిల్లా గోపాలపేటకు వెళ్లారు.

పెళ్లి అయ్యాక ఆదివారం రాత్రి కూకట్పల్లి వస్తుండగా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న రామచంద్రయ్య (55) అక్కడికక్కడే మృతి చెందగా.. కారు నడుపుతున్న అతని కొడుకు భాస్కర్‌తో పాటు పద్మ అలివేలుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news