ఎమ్మెల్సీ తనకు రాకపోవటం పై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాకు దేవుడు నేను ఆయన భక్తుడిని అంటూ వ్యాఖ్యానించారు. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడని తెలిపారు. నాకు పదవి వచ్చినా రాకపోయినా అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు. రాజకీయాల్లో పదవి అనేది ఒక క్రీడ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకోసారి పదవి వస్తుంది ఒక్కో సారి రాదు..ఏ సందర్భం లో నైనా నేను ఒకేలా ఉంటానని ప్రక టించారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. నాకు పదవి రాకపోయినా బాధ పడనన్నారు. అనేక ఈక్వేషన్స్ తో ఎమ్మెల్సీల ఎన్నిక జరిగిందని వెల్లడించారు. కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఈ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వటం సరైందేనన్నారు. అటు పిఠాపురం వర్మ కూడా ఈ విషయంలో నిరాశే చెందాడు.