కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు షాక్ తగిలింది. కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముడా భూముల కేటాయింపులలో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తూ.. ఓ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు పై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ స్పందించారు. దీంతో గవర్నర్…. సిద్దరామయ్యను విచారించాలని ఆదేశాలు జారీ చేసారు.
దీంతో కొత్త సీఎం వస్తారని చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే… సీఎం సిద్ధరామయ్య ఇంటి చేరుకుంటున్నారు మంత్రుల, ఎమ్మెల్యేలు. మంత్రులతో సమావేశం కానున్న సీఎం సిద్ధరామయ్య….సీఎంకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో తదుపరి చర్యలపై చర్చిచే అవకాశం ఉంది. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారట సీఎం సిద్ధరామయ్య. తన అధికారాన్ని ఉపయోగించుకుని స్వతంత్రంగా దర్యాప్తునకు అనుమతి ఇచ్చిన గవర్నర్ చర్యలో తప్పులేదని కాంగ్రెస్ భావిస్తోందట. అటు సీఎం నివాసంకు చేరుకున్న డిప్యూటీ సీఎం డికే శివకుమార్…దీనిపై ఇంకా స్పందించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకకు కొత్త సీఎం పక్కా అంటున్నారు.