మహిళలకు నెలసరి రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలనే డిమాండ్ కు ఈదఫా ఐక్యరాజ్య సమితి వేదిక అయింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 79వ సర్వసభ్య ప్రతినిధి సభలో సమ్మిట్ ఆఫ్ ది ప్యూచర్ కార్యక్రమంలో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమ కారిని రంజితా ప్రియదర్శిని గళం విప్పారు. రెండోసారి ఐక్యరాజ్యసమితి సదస్సుకు హాజరైనందుకు గర్వంగా ఉందని చెప్పారు. నెలసరి రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నదే తన ప్రధాన లక్ష్యం అని వెల్లడించారు.
తన డిమాండ్ నెరవేరినప్పుడే మహిళల జీతంలో కోతపడుతుందని ఆలోచించకుండా సెలవు తీసుకోగలుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. నెలసరి రోజుల్లో మహిళలకు ఒకటి నుంచి రెండు రోజుల వరకు సెలవు ఇవ్వాలని.. జీతం ఇవ్వకపోతే ఏ మహిళా ఆ సెలవు తీసుకోదని వెల్లడించారు. మహిళల నెలసరి ఆరోగ్యం చాలా ముఖ్యం అన్నారు. తన పోరాటం వెనుక తాను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయని వెల్లడించింది రంజితా ప్రియదర్శిని.