తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె పోరాటానికి స్ఫూర్తి గా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే కోఠి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ నామకరణం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
మల్లంపల్లి మక్తెదారు ఉత్తమరాజు కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా.. దానిని ఐలమ్మ కౌలుకు తీసుకుంది. కొండల్ రావు తల్లి జయప్రదా దేవి ఐలమ్మకూ భూమి సాగు చేసుకునేందుకు అనుమతి ఇచింది. ఆ భూమిలో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది.ఆ సమయంలో దేశ్‌ముఖ్ దొరకు ఎదురుతిరిగిన వీర వనితగా గుర్తింపు పొందింది చాకలి ఐలమ్మ.