రాష్ట్రపతి భవన్ లో ప్రత్యక్ష్యమైన వింత జంతువు..!

-

రాష్ట్రపతి భవన్ లో అతిరధ మహారథుల మధ్య మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. అయితే VIPలు ఉన్న ఆ ప్రదేశంలో చిరుత లాంటి ఓ జంతువు స్వేచ్చగా తిరుగుతుండటం తాజాగా వెలుగులోకి వచ్చింది.  దుర్గా దాస్ ప్రమాణం చేస్తుండగా వెనుక భాగంలో చిరుత లాంటి ఓ జంతువు తిరుగుతూ కనిపించింది. అంత మంది మాట్లాడుతుండగ ఆ జంతువు కొంచెం కూడా భయం లేకుండా ఆ ప్రదేశంలో తిరగడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోందని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరైతే అసలు ఈ జంతువు ఏంట అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది పెంపుడు జంతువా? పిల్లా? లేక చిరుత ప్రవేశించిందా? అనే దానిపై చర్చ జరుగుతోంది.

71 మంది మంత్రులతో కలిసి రికార్డు స్థాయిలో మూడోసారి ప్రధాని ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది జూనియర్ మంత్రులు, ఐదుగురికి స్వతంత్ర బాధ్యతలు అప్పగించనున్నారు. పోర్ట్ఫోలియోలను తర్వాత ప్రకటిస్తారు. BJP మెజారిటీ మార్కు 272 కంటే తక్కువగా పడిపోవడంతో తన మూడోసారి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న PM మోడీ, జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడవసారి ఎన్నికైన రెండో ప్రధానమంత్రిగా చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version