లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ప్రధాని మోడీనే రక్షిస్తున్నాడు : కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనాటే

-

బీజేపీ ఐటీ సెల్ హెడ్ లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని బీజేపీ లీడరే మాట్లాడుతున్నారని, మోదీ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కాకముందే ఇవి బయటకి వచ్చాయని, అతన్ని వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా నీచమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని బీజేపీ నేత రాహుల్ సిన్హాకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ సభ్యుడు శంతను సిన్హా అన్నారని తెలిపారు. ఇది ఎక్కడో ఫైవ్ స్టార్ హోటళ్లలో జరుగుతుంది కాదని, పశ్చిమ బెంగాల్లోని బీజేపీ కార్యాలయాల్లో జరుగుతుందని ఆమె ఆరోపించారు.

మనం బీజేపీ నుంచి కోరేది ఒక్కటేనని, భారతీయ మహిళలకు న్యాయం జరిగేలా చూడాలి అని అన్నారు. ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల కంటే తక్కువ సమయంలోనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయని మండిపడ్డారు. గతంలో కూడా ఐఐటీ గ్యాంగ్ రేప్ లో పేర్లు ఉన్న ముగ్గురు కూడా బీజేపీ ఐటీ సెల్ సభ్యులేనని, వారందరికి మోడీ తో బీజేపీ సీనియర్ లీడర్స్ తో మంచి తత్సంబందాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కుల్దీప్ సింగ్, చిన్నాయానంద్, బ్రిజ్ భూషన్, అంకితా బండారి హంతకుడితో పాటు బిల్కిస్ బానుని గ్యాంగ్ రేప్ లో పేర్లు ముగ్గురికి కూడా బీజేపీతో మంచి సత్సంబంధాలున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version