ఏపీలో తాగి స్కూలుకు వస్తున్నారు ఓ టీచర్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మద్యం మత్తులో డిప్యూటీ డీఈవో ఎదుటే చిందులేసిన హెడ్ మాస్టర్.. రెచ్చిపోయి ప్రవర్థించాడు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంఠినవలస హైస్కూల్లో మద్యం తాగి విధులకు హాజరయ్యాడు ఓ హెడ్మాస్టర్.

ఇక విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈవో ముందే అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు హెచ్ఏం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే రిపోర్టు సేకరిస్తున్నారు. హెడ్మాస్టర్పై శాసన చర్యలు తప్పవని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మద్యం మత్తులో విధులకు రావడం, పైగా ఉన్నతాధికారుల సమక్షంలోనే రెచ్చిపోవడం వల్ల ఆయనపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.
ఏపీలో తాగి స్కూలుకు వస్తున్న టీచర్
మద్యం మత్తులో డిప్యూటీ డీఈవో ఎదుటే చిందులేసిన హెడ్మాస్టర్
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంఠినవలస హైస్కూల్లో మద్యం తాగి విధులకు హాజరైన హెడ్మాస్టర్
విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈవో ముందే అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన హెచ్ఏం pic.twitter.com/4gcoqeiaOd
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025