గణేశ్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో వేర్వేరు ఘటనల్లో మొత్తం 10 మంది మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో భక్తులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు.

అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతలవీధిలో డాన్స్ చేస్తున్న భక్తులపై నుంచి స్కార్పియో కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. అలాగే, నెల్లూరు జిల్లా కావలిలో మరో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ నీటిలో పడి యువతి
ప్రాణాలు కోల్పోయింది.