భారత భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఆ బస్సులో దాదాపు 39 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా అందరూ భయాందోళకకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది.
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో బస్సు అదుపు తప్పి నదిలో పడింది. బస్సులో ఐటీబీపీ జవాన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సులో మొత్తం 39 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 37 మంది ఐటీబీపీ, ఇద్దరు కశ్మీర్ పోలీసులు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రిస్లాన్ వద్ద బ్రెక్ ఫెయిల్ అవ్వడంతో ట్రక్ నదిలో దూసుకెళ్లింది.
అమర్‌నాథ్ యాత్ర విధులు ముగించుకుని చందన్‌వారీ నుంచి పహల్‌గామ్ వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.