బండి సంజయ్ యాత్రపై టీఆరెస్ చేసిన దాడిని ఖండిస్తున్నానన్నారు తెలంగాణ బిజిపి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆరెస్ పాల్పడుతోందని.. టీఆరెస్ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని.. కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.
పోలీసుల తీరు సైతం సరిగ్గా లేదని.. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు. పోలీసులు న్యాయం వైపు ఉండాలని పేర్కొన్నారు. బీజేపీలో చేరికలు జరుగుతూనే ఉన్నాయని.. కాంగ్రెస్, టీఆరెస్ ల నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారు. అమిత్ షా సభపై రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలంగాణ బిజిపి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తెలిపారు.