జపాన్‌లో అగ్నిపర్వతం విస్పోటనం.. భయం గుప్పిట్లో ప్రజలు

-

సకురజిమా అగ్ని పర్వతం దక్షిణ జపాన్ లోని ఉందగా.. అది ఆదివారం రాత్రి బద్దలైంది. ఈ నేపథ్యంలో.. జపాన్ డిప్యూటీ చీఫ్ కేబినెట్ సెక్రెటరీ యషిహికో ఇసోజకి మాట్లాడుతూ.. కొంతకాలం నుంచి యాక్టివ్ గా ఉన్న ఈ అగ్నిపర్వతం అప్పుడప్పుడూ స్వల్పంగా పొగ, బూడిదను వెదజల్లుతూ ఉంటుందని.. కానీ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో.. ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో బద్దలవడం మొదలుపెట్టిందని వెల్లడించారు. ఏకంగా ఐదో స్థాయి ప్రమాద హెచ్చరికను జారీ చేశామని ఆయన వెల్లడించారు. సమీపంలోని అరిమురా, ఫురుసతో పట్టణాలు, ఇతర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. రాత్రి కావడం, చీకటిగా ఉండటం నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదని వెల్లడించిన యషిహికో ఇసోజకి.. సకురజిమా అగ్ని పర్వతం కొన్నేళ్లుగా యాక్టివ్ గా ఉందని.. తరచూ బూడిద, పొగను వెదజల్లుతోందన్నారు.

దానితో అగ్ని పర్వతాన్ని సందర్శించేందుకు, దాని వద్దకు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు తెలిపారు. తాజాగా ఆదివారం రోజున ఒక్కసారిగా భారీ ఎత్తున సంభవించిన పేలుడుతో ఏకంగా 2.5 కిలోమీటర్ల ఎత్తున రాళ్లు, దుమ్ము ఎగజిమ్మినట్టు వెల్లడించింది జపాన్ వాతావరణ శాఖ. అగ్ని పర్వతం నుంచి వెలువడిన దుమ్ము, ధూళి మేఘాల్లో కలిసి.. ఆ ప్రాంతమంతా చీకటి మయంగా మారినట్టు తెలిపింది జపాన్ వాతావరణ శాఖ. జపాన్ తరచూ భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుళ్లకు నిలయమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉందని, అందువల్ల అక్కడి అగ్ని పర్వతాలు యాక్టివ్ గా ఉంటాయని జపాన్ వాతావరణ శాఖ. తరచూ భూకంపాలు కూడా వస్తుంటాయి. వాస్తవానికి సకురజిమా అగ్ని పర్వతం ఒకప్పుడు సముద్రంలో దీవిలా ఉండేది. తరచూ లావాను వెదజల్లి దానితో విస్తృత భూభాగం ఏర్పడింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version