మానవ నాశన ఉత్ప్రేరకాలు వాడకానికి మరియు వాటిని రవాణా చేసినా చట్టరీత్య కఠినమైన శిక్షకు అర్హులు అన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా ఈ డ్రగ్స్ కు వ్యతిరేకం అని చెప్పాలి. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అయిదు సంవత్సరాల క్రితం డ్రగ్స్ రవాణా కేసులో పట్టుబడిన సారిదేవి దామని మహిళకు సింగపూర్ ప్రభుత్వం ఆమెకు ఉరిశిక్ష విధించింది. ఇక ఆమె కోర్ట్ లో ఈ విషయంపై ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోగా సింగపూర్ కోర్ట్ ఆమెను దోషిగా తేల్చింది. పై కోర్టులు కూడా ఈమె అప్పీల్ చేసిన పిటిషన్ లను కొట్టివేసింది. ఇక సింగపూర్ అధ్యక్షడికి సైతం ఈమె క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకోగా. ఆయన సార్థం ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను క్షమించకూడదని ససేమిరా అన్నారు.