మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన మహిళా కానిస్టేబుల్

-

మారుతున్న పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, ఫుడ్ కల్చర్ వలన ఈ మధ్యకాలంలో చాలా మంది జబ్బుల బారిన పడుతున్నారు. కొందరైతే ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మరణిస్తున్నారు. గతంలో ఎటువంటి గుండె సబంధిత వ్యాధులు లేకున్నా ఉన్నట్టుండి కుప్పకూలిపోయి గుండెపోటుకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి కేసులు చాలా పెరిగాయి.

దీనికి ఫిజికల్ ఎఫర్ట్ లేకపోవడం, స్ట్రెస్ లైఫ్, జంక్ ఫుడ్స్ కారణమని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ – ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

https://twitter.com/TeluguScribe/status/1892451666848293246

Read more RELATED
Recommended to you

Latest news