పూరీ క్షేత్రంలో అద్భుత దృశ్యం.. జెండాతో గరుత్మంతుడి వీరవిహారం.. వీడియో!

-

ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుడి క్షేత్రంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నీలచక్రంపై ఎగిరే జెండాను గరుత్మంతుడు (గద్ద) పట్టుకెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఆలయం చుట్టూ గద్ద తిరుగుతుండటం చూసి భక్తులు షాక్ అయ్యారు. పూరీకి వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఆ జెండాను దర్శనం చేసుకుని మొక్కడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల సమయంలో పూరీలో ఆలయంపైకి ఎక్కి జెండాను మారుస్తారు.అంత పవిత్రమైన జెండాను ఎన్నడూ లేనివిధంగా గద్ద లాక్కెళ్లడంతో భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ గరుత్మంతుడే ఆ జగన్నాధుడికి ప్రదక్షిణలు చేస్తూ స్వామి వారిని స్మరించుకుందని భక్తులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news