తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. గతేడాది దసరా పండుగ సందర్బంగా మహిళా లబ్దిదారులకు అందజేయాల్సిన బతుకమ్మ చీరలను పంపిణీ చేయకుండా అలాగే నిల్వ చేసి తాజాగా రోడ్డుపై కుప్పలుగా పడేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత రైతుబజారులో బతుకమ్మ చీరలు కుప్పలుగా పడి దర్శనమిస్తున్నాయి.
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయాల్సిన చీరలను రైతుబజారులో ఎవరు పడేశారని ప్రశ్నలు ప్రస్తుతం సామాన్యులకు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని పేదలకు పంపిణీ చేసి ఉంటే ప్రయోజనం ఉండేదని పట్టణ వాసులు అనుకుంటున్నారు. తెలంగాణ సర్కారు సామాన్యులను పట్టించుకోవడం లేదని, అందుకు ఈ ఘటనే నిదర్శనమని పేర్కొంటున్నారు.