రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరి రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను హిందుత్వాన్ని కాపాడేందుకు ఇక్కడికి వచ్చానని అన్ని దేవాలయాలు తిరుగుతూ నాన న్యూసెన్స్ చేసింది లేడీ అఘోరి. అయితే తాజాగా ఆ లేడీ అఘోరి బండారం బయటకు వచ్చింది. లేడీ అఘోరి మొదటి భార్యను నేనే అంటూ యువతీ బయటకు వచ్చి… బండారం బయటపెట్టింది.

తమ వివాహం జనవరి ఒకటో తేదీన జరిగిందని ఈ సందర్భంగా బాధిత యువతీ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వర్షిని అనే అమ్మాయిని అఘోరి పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో బయటకు వచ్చినట్లు వెల్లడించారు. మీడియా అలాగే పోలీస్ శాఖ,, ప్రభుత్వం ఈ విషయంలో అగోరిపై చర్యలు తీసుకోవాలని యువతి డిమాండ్ చేసింది.
"లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే".. ఓ యువతి సంచలనం
తమ పెళ్లి జనవరి 1న జరిగిందని తెలిపిన యువతి
ఆ తర్వాత వర్షిణి అనే అమ్మాయిని అఘోరీ పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో బయటికి వచ్చినట్లు వెల్లడి
మీడియా, పోలీస్ శాఖ, ప్రభుత్వం ఈ విషయంలో అఘోరీపై చర్యలు తీసుకోవాలని కోరిన యువతి pic.twitter.com/5KI7g1D3qn
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2025