కెరీర్ ని చేతులారా పాడు చేసుకుంటున్న యువహీరో..!!

-

రాజావారు రాణిగారు అంటూ తన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా లో ఒక సరికొత్త హీరో అది కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విజయం సాధించాలంటే అది ఒక వరం అని చెప్పవచ్చు ఇలా రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ప్రస్తుతం తన కెరియర్ ని తనే చేతులారా పాడు చేసుకుంటున్నాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.వాస్తవానికి ఓ టి టి లో సెబాస్టియన్ సినిమాని విడుదల చేయడం జరిగింది. కానీ ఈ సినిమా కూడా ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఇక తర్వాత తాజాగా సమ్మతమే అనే చిత్రంతో మళ్ళీ కనిపించారు కానీ ఈ సినిమా కూడా అనుకున్న దానికంటే ఘోరంగా పరాజయ దిశగా ఉన్నట్లు సమాచారం దీనికి ముఖ్య కారణం ఏమిటంటే కిరణ్ అబ్బవరం అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ కొత్త హీరో అయినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కెరియర్ మొదట్లో విభిన్నమైన చిత్రాలు తీయవలసి ఉంటుంది.కానీ కిరణ్ అబ్బవరం మాస్ ఇమేజ్తో ప్రేక్షకులను అలరించాలి అనుకున్నారు కానీ దాంతో మొదటికే మోసం వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎటువంటి సినిమా అయినా సరే , ఏ హీరో నటించిన నచ్చకపోతే ప్రేక్షకులు సినిమా చూడడం మానేస్తారు అలాంటిది కిరణ్ నటించిన సమ్మతమే సినిమాలో ఫైట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా పరాజయానికి ముఖ్యకారణం ఆన్నట్లు సమాచారం. కిరణ్ అబ్బవరం తన కెరీర్లో ప్రయోగాలు చేయడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న pయువ హీరోలలో ఈ హీరోకి ఉన్నంత బజ్ ఏ హీరోకి రాలేదని చెప్పవచ్చు. అదంతా కేవలం ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రం ద్వారానే వచ్చింది. అలా వచ్చిన క్రేజ్ను మొత్తం ఇలాంటి సినిమాలతో పోగొట్టుకున్నాడు. మరి రాబోయే రోజులలోనైనా విభిన్న కథలతో అలరిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version