తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..నేడే ఆర్జితసేవా టికెట్లు విడుదల

-

తిరుమల….శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేడు ఆన్ లైన్ లో సెప్టెంబర్‌ మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టిటిడి పాలక మండలి. ఇందులో భాగంగానే… 46, 470 సేవా టికెట్ల ను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

లక్కి డిఫ్ విధానంలో 8070 టిక్కేట్లు….ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపాదికన 38400 టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవా టిక్కేట్లను లక్కిడిఫ్ విధానంలో కేటాయించనుంది టీటీడీ పాలక మండలి.

కాగా.. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. ఇవాళ సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 88,613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 36,153 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండీ ఆదాయం రూ.4.24 కోట్లు గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version