ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడు మృతి.. ఎక్కడంటే?

-

ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు బలవణ్మరనానికి పాల్పడిన ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. యువకుడి ఆత్మహత్యను రేణిగుంట వద్ద కండక్టర్‌ ముందుగా గుర్తించారు. బస్సులోని చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు గుర్తించిన కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ సమయంలో బస్సులో ముగ్గురే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు ప్రయాణంలో ఉన్నపుడు యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడా? లేక ఆగిన సమయంలో ఉరేసుకున్నాడా? అనేది తెలియరాలేదు. కాగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version