ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసాడు ఓ యువకుడు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసిన యువకుడి కేసు వివరాలు ఇలా ఉన్నాయి. యువతి, యువకులు ఇద్దరూ ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. హుజూర్‌నగర్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న యువతి పైనే దాడి చేసాడు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/crime.jpg)
యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు సుందర్ ప్రమోద్ కుమార్. యువకుడిని అడ్డుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
https://twitter.com/PulseNewsTelugu/status/1889550154346516918