ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతున్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన రైలు!

-

ఫోన్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం, వాహనాలు డ్రైవ్ చేయడం, పట్టాలు దాటడం ఈ మధ్యకాలంలో కొందరికి బాగా అలవాటు అయ్యింది. ఫలితంగా కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరం అని చెప్పినా కొందరు వినిపించుకోవడం లేదు. అదేవిధంగా రోడ్డు, రైల్వే ట్రాక్స్ దాటే టప్పుడు ఫోన్ మాట్లాడి ప్రాణాలు కోల్పోయిన వారూ చాలా మందే ఉన్నారు.

తాజాగా ఓ యువతి రైల్వే ట్రాక్స్ దాటే క్రమంలో ఫోన్ మాట్లాడుతుండగా అనుకోకుండా ఒక్కసారిగా ట్రైయిన్ దూసుకొచ్చింది. దీంతో ఆ యువతి పట్టాల మధ్యలో పడుకోవడంతో రైలు ఆమె మీదుగా వెళ్లిపోతుంది. ఈ ఘటనలో ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. రైలు వెళ్లిపోయాక యువతి మరల లేచి మళ్లీ ఫోన్ మట్లాడుతూ వెళ్లిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news