ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ సమర్పించాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండేది. అయితే.. చాలామంది చదువుకోని వారు, పాన్ కార్డుపై అవగాహన లేని వాళ్లు పాన్ కార్డు తీసుకోకపోవడంతో.. ఐటీ రిటర్న్స్ సమర్పించడం కష్టంగా మారేది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఇన్ కమ్ టాక్స్ గురించి నిర్మల ప్రస్తావిస్తూ… ఇటీ రిటర్న్స్ కోసం పాన్ కార్డు లేనివాళ్లు ఆధార్ కార్డు కూడా సమర్పించవచ్చని తెలిపారు.
ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ సమర్పించాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండేది. అయితే.. చాలామంది చదువుకోని వారు, పాన్ కార్డుపై అవగాహన లేని వాళ్లు పాన్ కార్డు తీసుకోకపోవడంతో.. ఐటీ రిటర్న్స్ సమర్పించడం కష్టంగా మారేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని.. పాన్ కార్డు లేకున్నా.. ఆధార్ సమర్పించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
దేశంలో మొత్తం 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని మంత్రి తెలిపారు. అంటే… దేశంలోని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్నట్టే లెక్క. అందుకే.. ఆధార్ కార్డుతో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
ఇక.. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఆదాయపు పన్నుపై ప్రకటించిన స్లాబుల్లో ఎటువంటి మార్పు లేదు. 5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎటువంటి టాక్స్ ఉండదు. 5 లక్షలు దాటిన వారు మాత్రం స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.