ప్రభాస్ ను సైకో అంటున్న శ్రద్ధా కపూర్.. సాహో ఫస్ట్ సాంగ్ టీజర్

-

ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ప్రభాస్ ను శ్రద్ధా సైకో అంటూ సాగే పాట అది.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 న సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో రీలీజ్ కానుంది.

ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ప్రభాస్ ను శ్రద్ధా సైకో అంటూ సాగే పాట అది. సైకో సయాన్ అనే పాట టీజర్ ను రిలీజ్ చేశారు. పూర్తి పాటను ఈనెల 8న రిలీజ్ చేస్తారట.

నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్లంతా ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ త్రయం ఈ సినిమా నుంచి తప్పుకున్నాక.. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక.. ఈ సినిమాపై కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. దేశమంతా భారీగా అంచనాలు ఉన్నాయి.




Read more RELATED
Recommended to you

Exit mobile version