వైసీపీకి గుడ్ బై చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు…

-

సినీనటుడు, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీని వీడి తెదేపాలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఈ రోజు ఉదయం లేఖ రాశారు. వైకాపా నుంచి తెనాలి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఆయన భావించగా.. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి పోటీచేయాలని జగన్‌ సూచించడంతో… దీనిపై మనస్తాపం చెందిన ఆయన  వైకాపాను వీడాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  చాలా ఏళ్లుగా వైకాపాలో కొనసాగిన ఆయన కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా  బంధువైన ఆదిశేషగిరిరావు ఇటీవల ప్రభుత్వ విప్‌ బుద్ధా వెంకన్న ద్వారా తెదేపాలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version