Liger నుంచి బిగ్‌ అప్డేట్‌..రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్‌

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.


అయితే ఈ లైగర్ సినిమా తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలోని ఆఫాత్‌ అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్‌ లో విజయ్ దేవరకొండ, అనన్య చాలా అందంగా కనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ అదిరిపోయాయి. అలాగే లిరిక్స్‌ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version