వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు : ఆనం

-

నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం బహిరంగ సభ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరంలోఏర్పాటు చేశారు. ఈ సభకు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా వచ్చారు. ఆయన మాట్లాడుతూ, నారా లోకేశ్ ప్రజల ఆశీస్సులతో 1600 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారని తెలిపారు ఆనం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మకూరులో తట్టెడు మట్టి వెయ్యలేదని మండిపడ్డారు. ఇక్కడ ప్రజలకు ఇసుక దొరకకుండా చేసి వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు ఆయన. సోమశిల ప్రాజెక్టు డ్యామేజ్ అయితే మరమ్మత్తుల కోసం వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని వ్యక్తపరిచారు.

“నేను వైసీపీ నుండి గెలిచిన మూడు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం మాఫియా రాజ్యం అయిపోయింది. రైల్వే లైన్, ప్రభుత్వ ఆసుపత్రి అన్ని వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. యువతకు భవిష్యత్తు ఇచ్చేది లోకేశ్. ఆత్మకూరుని అభివృద్ది చేయబోయేది టీడీపీనే. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆత్మకూరుకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని కోరుతున్నాను. వైసీపీది విధ్వంసకర ప్రభుత్వం. కొత్తవి కట్టడం వీళ్ళకి చేతకాదు. అందుకే ఇది సైకో ప్రభుత్వం. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేసింది అంటే తన పతనాన్ని తనే కోరుకుంది. సోమశిల ప్రాజెక్టును సైకో ధ్వంసం చేశాడు. సోమశిల ఉత్తర కాలువను నాశనం చేశాడు. సైకో పోవాలి… సైకిల్ రావాలి” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు ఆనం రామనారాయణరెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version