భారతీయ చలన చిత్ర రంగంలో ఎంత మంది కథానాయికలు వచ్చిపోయినా విశ్వ సుందరి ఐశ్వర్యాయ్ది మాత్రం ప్రత్యేక స్థానం. మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన ఈ బ్యూటీ.. ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులు దోచేసింది. మణిరత్నం తెరకెక్కించిన ఇరువుర్(ఇద్దరు) సినిమాతో ఈ భామ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడింది.
చూపు తిప్పుకోనివ్వని అందం.. అద్భుతమైన నటన.. అంతకుమించిన మనసుతో ఐశ్వర్య అందరి మనసులు దోచేసింది. తన ప్రియుడు అభిషేక బచ్చన్‌ను పెళ్లాడి ఆరాధ్యకు జన్మనిచ్చింది. అచ్చం తల్లిలాగే ఆరాధ్య కూడా అందగత్తే. తల్లిని మించిన అందంతో ఈ చిన్నారి కూడా అందరిని ఫిదా చేస్తోంది. తరచూ ఈ తల్లీకూతుళ్లు బాలీవుడ్ మీడియా కంట పడుతూ ఫొటోలకు పోజులిస్తుంటారు.
ఆరాధ్య-ఐశ్వర్యల ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆరాధ్యను చూసిన నెటిజన్లు అచ్చం తల్లిలాగే ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఆరాధ్యను ఐష్‌తో పోల్చలేమని.. ఐష్ బ్యూటీని ఎవరితో పోల్చలేమని పొగిడేస్తున్నారు.
ఇంకొందరు నెటిజన్లు ఆరాధ్య.. ఐశ్వర్యకు ప్రింట్ తీసినట్టుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు తల్లీకూతుళ్లలా కాకుండా అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తున్నారని అంటున్నారు. శుక్రవారం ముంబయిలో జరిగిన ఎన్ఎంఏసీసీ ఈవెంట్ లాంచ్‌కు ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.