విరాట్ కోహ్లిపై ఏబీ డివిలియ‌ర్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లు.. ప్ర‌త్యేక‌మైన నాయ‌కుడ‌ని వ్యాఖ్య‌..

-

ఇంగ్లండ్‌తో జ‌రిగిన చివ‌రి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ఆ జ‌ట్టుపై భార‌త్ సునాయాసంగా ఘ‌న విజ‌యం సాధించింది. 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ను 3-1తో కైవ‌సం చేసుకుని వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించింది. అయితే కోహ్లి నాయ‌క‌త్వంపై తోటి ఆర్‌సీబీ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.

కోహ్లి ప్ర‌త్యేక‌మైన నాయకుడ‌ని, అత‌ని నాయ‌కత్వం వ‌ల్లే అక్ష‌ర్ ప‌టేల్‌, రిష‌బ్ పంత్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ వంటి యువ‌కుల ప్ర‌తిభ వెలుగులోకి వ‌చ్చింద‌ని డివిలియ‌ర్స్ అన్నాడు. కోహ్లి నాయ‌క‌త్వంలో యువ‌కులు స్వేచ్ఛ‌గా ఆడుతూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల ప్లేయ‌ర్ల‌ను డామినేట్ చేస్తున్నార‌ని అన్నాడు. ప్లేయ‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న ఆశించిన స్థాయిలో లేన‌ప్పుడు వారికి ప్రేర‌ణగా నిల‌వ‌డ‌మే కాకుండా, వారి బాడీ లాంగ్వేజ్‌ను కూడా పూర్తిగా మార్చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ప్ర‌త్యేక‌మైన నాయ‌కుడు కోహ్లి అని డివిలియ‌ర్స్ అన్నాడు.

కాగా చివ‌రి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఇద్ద‌రూ చెరో 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాసించారు. వారిద్ద‌రూ సిరీస్‌లో మొత్తం 59 వికెట్లు తీయ‌డం విశేషం. మొద‌టి టెస్టు మ్యాచ్‌లో ఓట‌మి పాలైనా వెంట‌నే లేచి నిల‌బ‌డ్డ భార‌త్ మిగిలిన 3 మ్యాచ్‌ల‌లోనూ అద్భుతంగా రాణించింది. దీంతో లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో జూన్ 18 నుంచి జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌లో భార‌త్ న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version