ఏపీ మాజీ సిఎం చంద్రబాబును ఉద్దేశించి ఏపీ మంత్రి పేర్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించినందుకు చంద్రబాబు ప్రజల మీద తన అక్కసు అంతా వెళ్లగక్కాడని అన్నారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును హెరిటేజ్ లో పాలు, పిడకలు అమ్మినట్లు రాసుకున్న విషయం ఎవరికీ తెలియదు అనుకుంటున్నారని అన్నారు. హెరిటేజ్ లో పాపము కంపు వస్తుందని ఆయన అన్నారు. అమరావతి పేరుతో ప్రజల నుంచి భూములు లాక్కుంది చంద్రబాబు అని పేర్కొన్న ఆయన ఏ మొహం పెట్టుకుని విజయవాడ, గుంటూరులో ఓట్లు అడగటానికి వచ్చారు? అని ప్రశ్నించారు.
చంద్రబాబు మాయగాడని, ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం అంటే నాకు ప్రేమ అంటాడని ఆయన అన్నారు. చంద్రబాబుకు అధికారం అంటే ప్రేమ అని అన్నారు. 2019లో ప్రజలు వదిలేశారు…2021లో కార్యకర్తలు కూడా చంద్రబాబు ను వదిలేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. సైకిల్ డిప్పలు కొట్టేసే వ్యక్తులను పక్కన పెట్టుకుని చంద్రబాబు మాట్లాడుతున్నాడని మంత్రి అన్నారు. అమ్మవారు కళ్ళు తెరవబట్టే చంద్రబాబుకు ఈ గతి పట్టిందని, అమరావతి పేరుతో ప్రజలకు మోసం, దగా చేశారని హైదరాబాద్ లో ఎక్కడ అరెస్టు చేస్తారో అని భయపడి అర్థరాత్రి పారిపోయి వచ్చారని ఆయన అన్నారు.