ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హత్యకు ఏబీ వెంకటేశ్వర రావు కుట్ర పన్నుతున్నారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. గతంలో విశాఖ ఎయిర్ పోర్టులో ముందస్తు ప్రణాళికతోనే హత్యాయత్నం చేశారని.. జగన్‌పై హత్య పై మరోసారి టీడీపీ కుట్ర బయట పడిందన్నారు.
జగన్ మోహన్ రెడ్డిపై హత్య కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారని.. మాజీ డీజీ,మాజీ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు ఇంటికి జగన్ పై దాడి చేసిన వ్యక్తి వెళ్లడం దేనికి సంకేతం..ఇది సమంజసమా? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జగన్ హత్య మిస్ అయ్యిందని, ఈసారి పక్కా ఈ ప్రణాళికతో అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతను చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని..NIA చార్జిషీట్‌లో క్లియర్‌గా అటాక్ అని, ప్రీ మర్డర్ ప్లాన్ చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చిందని చెప్పారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లను వెంకటేశ్వర్ రావు ట్యాప్ చేశారని అన్నారు.వివేకా హత్య కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చి బయట తిప్పడం దేనికి సంకేతమని అడిగారు. అంబేడ్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.