ఏపీలో హత్యారాజకీయాలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి మాజీ సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ హయాంలో హత్యారాజకీయాలు పెట్రేగిపోయాయని వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పరిటాల సునీత, పరిటాల రవికి మద్దతుగా సదరు వ్యక్తి కామెంట్స్ చేశారు.
అనంతరం ఓ బార్‌లో మద్యం సేవిస్తున్న తరుణంలో సదరు వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు అటాక్ చేశారు. అతనితో గొడవ పెట్టుకుని మరీ దాడికి యత్నించారు. అనంతరం బీర్ బాటిల్‌తో తల పగుల గొట్టారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.