మిస్టరీగా మారిన అబ్దుల్లాపూర్మెట్ డబుల్ మర్డర్ కేసు

-

అబ్ధుల్లాపూర్ మెట్ జంట హత్యలు రాష్ట్రంలో సంచలనం రేపింది. యువతీ యువకులను నగ్నంగా అత్యంత దారుణంగా హత్య చేశారు. యువకుడి మర్మాంగాలను చిధ్రం చేసి, యువతి ముఖంపై బండతో మోదీ అత్యంత పాశవికంగా హత్య చేయడం కలకలం రేపింది. మంగళవారం అబ్ధుల్లాపూర్ మెట్ బ్రిడ్జి వద్ద రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ వారాసిగూడ చెందని యువకుడు యశ్వంత్, మహిళ జ్యోతిగా గుర్తించారు. మృతిచెందిన జ్యోతి కి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు విచారణలో తేలింది. జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణం అని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గురైన యశ్వంత్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఫోన్ కాల్ రావడంతో ఇంట్లో నుంచి యశ్వంత్ బయటకు వెళ్లినట్లు  కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

ప్రస్తుతం హత్య కేసులో పోలీసులు 3 ప్రత్యేక టీములతో విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలానికి యశ్వంత్ కుటుంబ సభ్యులు వచ్చినా… సమాచారం అందించినప్పటికీ జ్యోతి కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో భర్త శ్రీనివాస్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి భర్త శ్రీనివాస్ విజయవాడలో ఉన్నట్లు సమాచారం తో విజయవాడకు ప్రత్యేక టీంను పంపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version