దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ ఇద్దరికి బెయిల్

-

దిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓవైపు అధికారులు దర్యాప్తు జరుగుతోంటే.. మరోవైపు ఇద్దరు నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో అభిషేక్, విజయ్ నాయర్‌లకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుపై ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కస్టడీకి తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు 5 రోజుల ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణ కోసం ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అభిషేక్, విజయ్ నాయర్‌ను కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం కల్పించారు. ఈడీ కస్టడీలో ఉన్నపుడు కుటుంబీకులు కలిసేందుకు ప్రత్యేక కోర్టు అవకాశం ఇచ్చింది. తన తల్లిని కలిసేందుకు అభిషేక్‌కు కోర్టు అంగీకరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version