Hyderabad : సుశీ ఇన్‌ఫ్రాలో జీఎస్టీ అధికారుల సోదాలు

-

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ సంస్థలో రాష్ట్ర జీఎస్టీ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. 25 బృందాలతో సుమారు 150 మంది అధికారులు ఉదయం 11 గంటల నుంచి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ సంస్థకు బీజేపీ  నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కుమారుడు సంకీర్త్‌ రెడ్డి ఎండీగా ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతు ప్రసాద్‌ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్‌లోని సుశీ ఇన్‌ఫ్రా ప్రధాన కార్యాలయంతోపాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లపైనా సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సంస్థ నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగాయని టీఆర్ఎస్ ఆరోపించింది. లావాదేవాలకు సంబంధించిన జాబితాను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. దీనిని పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ వాటిని సుశీ ఇన్‌ఫ్రా లావాదేవీలుగానే తేల్చింది.  ఈ నేపథ్యంలో సంస్థపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు పన్నుల విషయంలోనే  తనిఖీలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version