జగన్ బద్ద శత్రువుని… ఇంటికి పిలిపించుకున్న అమిత్ షా..?

-

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. దమ్మున్న పత్రిక, దమ్మున్న ఛానల్ అంటూ ఆయన తన మీడియా గురించి చెప్పుకుంటుంటారు. అలాగే ఆయన తెలగుదేశం పార్టీకి కొమ్ముకాస్తుంటారని విశ్లేషకులు అంటుంటారు. ప్రస్తుతం జగన్ సీఎంగా ఉండటంతో ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.

గతంలో ఎన్నోసార్లు జగన్ ఎల్లో మీడియాగా ఈ ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ గురించి బహిరంగ సభల్లోనే చెప్పారు. ఇప్పుడు ఏపీలో అనధికారికంగా ఏబీఎన్ ఛానల్ పై నిషేధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణను పిలిపించుకుని మాట్లాడటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ.. ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో ఆదివారం భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సేపు సమావేశం అయినట్టు తెలుస్తోంది. అమిత్‌ షా ఆహ్వానం మేరకు ఢిల్లీలోని హోం మంత్రి నివాసానికి వెళ్లిన ఆర్కే ఆయనతో గంటన్నరపాటు సమావేశమయ్యారని ఆ పత్రిక రాసుకుంది.

జమ్మూ కశ్మీరుకు సంబంధించిన ఆర్టికల్‌ 370 నిర్వీర్యానికి సంబంధించి పలువురు ప్రముఖులతో కేంద్ర మంత్రులు సమావేశమవుతున్న నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్టు ఆ పత్రికలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల గురించి ఆయన ఆర్కేను అడిగి తెలుసుకున్నారట. మరి జగన్ కు బీజేపీ దూరమవుతున్న సమయంలో చంద్రబాబును బీజేపీకి దగ్గర చేసే మధ్యవర్తిత్వం ఆర్కే చేశారా అన్న అనుమానాలు ఏపీ రాజకీయ వర్గాలో కలుగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news