Breaking : బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

-

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారి బీజేపీకి ఒక మచ్చ పడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి బొమ్మైపై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 40 శాతం కమిషన్‌ ముట్టనిదే పనులేవీ కావని విపక్షాలు వారి పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కొడుకు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హాండెడ్‌గా దొరికిపోయారు. అతని ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా భారీగా నోట్లకట్టలు దొరికాయి. దీంతో ఆయనను శుక్రవారం ఉదయం అరెస్టుచేశారు పోలీసులు.

కర్ణాటక సోప్స్‌ అండ్‌ డిటర్జెంట్స్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మండల్‌ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్‌ మండల్‌ తన కార్యాలయంలో రూ.40 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు చెందిన లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. వాటితోపాటు ఆఫీస్‌లో లభించిన మరో రూ.కోటీ 40 లక్షలు సీజ్‌చేశారు అధికారులు. విచారణ అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 6 కోట్లు లభించాయి. దీంతో ఆయనను అధికారులు అరెస్టుచేశారు. ఆయన తండ్రి తరఫున లంచం తీసుకుంటున్నట్లు తేలిందని వెల్లడించారు. ఇంత నగదు ఎలా వచ్చిందనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఇదే విషయమై త్వరలోనే ఎమ్మెల్యే విరూపాక్షప్పకు కూడా లోకాయుక్త అధికారులు నోటీలు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version