ఈనెల 28న నల్గొండలో రైతు మహాధర్నా.. హాజరు కానున్న కేటీఆర్

-

నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు తాజాగా హైకోర్టు అనుమతి ఇచ్చింది.  ఈ నెల 28న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతినిచ్చింది హైకోర్టు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ రైతు  మహాధర్నా నిర్వహించుకోవాలని సూచించింది. దీక్షకు షరతులతో కూడిన ఫర్మిషన్ ఇచ్చింది. వాస్తవానికి జనవరి 21న నల్గొండ దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ భావించింది. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు.

విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతిని మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతుందని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ నల్గొండ పట్టణంలో మహాధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15వేల నుంచి రూ.12వేలకు కుదించడం, 4వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలు అమలు చేయడం లేదని.. వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడుతామని బీఆర్ఎస్ రైతు మహాధర్నాను తలపెట్టింది. ఇందులో కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. మహాధర్నా అనుమతి కోసం ఈనెల 17న బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఒకరోజు ముందు అనుమతి నిరాకరించడం ఏంటి..? అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version