ప్రస్తుతం ఏపీలో ఏసీబీ అధికారుల దూకుడు… “మాపై రాజకీయ ఒత్తిడులు లేకుండా చూడండి.. అనంతరం ఫలితం వేరేగా ఉంటుంది” అన్నట్లుగా ఉందని కామెంట్లు పడుతున్నాయి. మహా అయితే తాము అరెస్టు చేసిన వారి ఆరోగ్యం గురించి ఆరా తీయండి, లేకపోతే ఏదైనా సమాచారం మీదగ్గర ఉంటే ఇవ్వండి.. అంతేతప్ప మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకోకండి అని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి చెబుతున్నారంట. గత ప్రభుత్వంలో అవినీతి ఏరులై పారిందని కథనాలు వస్తున్న నేపథ్యంలో… అది వారి పనితీరు యొక్క ఫెయిల్యూర్ గా భావించారో ఏమో కానీ… ఇప్పుడు ఆ మచ్చ తుడిపెసుకోవడానికి సిద్ధమయ్యారు ఏసీబీ అధికారులు!
“తాము దిగనంతవరకే” అన్న రీతిలో వారు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారట. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు అనంతరం తామంటే తామని భుజాలు తడుముకుంటున్న ఏపీ మాజీ మంత్రులు ఇద్దరు బాబు పంచకు చేరిపోయారని తెలుస్తుంది. ఏసీబీ అధికారులు ఏ క్షణం డోర్ కొడతారో.. ఏక్షణం మీడియాకు బ్రేకింగ్ న్యూస్ అయిపోతామో.. పోలీసులు ఏ క్షణం తమ ప్రహారీ గోడ దూకుతారో తెలియక బిక్కు బిక్కు మంటూ ఏపీలో ఉండటం కంటే… కలో గంజో కలిసే తాగుదామని బాబు ఉన్న హైదరాబాద్ కు వచ్చేశారని తెలుస్తోంది. ఈ విషయంలో అచ్చెన్న అనంతరం వినిపిస్తున్న రెండు పేర్లకు సంబందించిన మాజీ మంత్రులు… ప్రస్తుతానికి తమ ఫోన్స్ స్విట్చ్ ఆఫ్ చేసి, సైలంటుగా ఉన్నారని.. ఆ కారణంతోనే ప్రెస్ ముందుకు కూడా రావడం లేదని.. కార్యకర్తలకు కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది!
ఏసీబీ, టీడీపీ మాజీ మంత్రులను ఆ రేంజ్ లో భయపెట్టిందన్న మాట!! ఈ లిస్ట్ లో మంత్రులు మాత్రమే ఉన్నారనుకుంటే పొరబాటే సుమా!! ఆ మంత్రుల తో పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అధికారుల లిస్ట్ కూడా చాలా పొడవుందని అంటున్నారు!! ఏది ఏమైనా… ప్రక్షాలన అంటే ఇది అనే మాటలు వినిపిస్తున్నాయి!! తాము దిగనంతవరకే… అంటే ఇదేనేమో!!