మల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కేసులో ఏసీబీ వేగం పెంచింది..అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నర్సింహారెడ్డి సహా మరో ఎనిమిది మంది నిందితుల ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.. నిందితులను బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు..హైటెక్ సిటిలోని ప్రభుత్వ భూమి కబ్జాపై విచారిస్తున్న ఏసీబీ అధికారులు.. సర్వే నెం:64లోని రెండు వేల గజాల ప్రభుత్వ భూమిపై ఏసీబీ విచారించనుంది…ఏసీబీ సోదాల్లో నర్సింహారెడ్డి నివాసంలో దొరికిన డాక్యుమెంట్స్, 490 గజాల నాలుగు వేరువేరు డాక్యుమెంట్స్‌పై నిందితులతో పాటు, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బందిని కూడా ఈరోజు ఏసీబీ విచారించనుంది.