ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ప్ర‌మాదం.. ఒక‌రు మృతి ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

-

హైద‌రాబాద్ చుట్టు ఔట‌ర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. లారీని ఒక కారు ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఒక్క‌రు స్పాట్ లోనే మ‌ర‌ణించారు. అలాగే మరో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. రంగా రెడ్డి జిల్లాలోని రాజేంద్ర న‌గ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్ ఔట‌ర్ రింగ్ రోడ్డు పై ఈ రోజు తెల్ల‌వారు జామున ఒక కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మ‌దం స‌మ‌యంలో కారులో ఆరుగురు ఉన్నారు. అందులో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. మ‌రో ముగ్గురి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ప్ర‌మాదం స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలు అయిన వారి పరిస్థితి విష‌మంగా ఉంద‌ని పోలీసులు తెలిపారు. కాగ కారు శంషాబాద్ నుంచి గ‌చ్చిబౌలి వైపు వ‌స్తుంద‌ని తెలిపారు. ఈ కారులో ఐదుగురు యువ‌కులు, ఒక యువ‌తి కూడా ఉన్నార‌ని తెలిపారు. అలాగే కారులో మ‌ద్యం బాటీళ్లు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌మాదానికి కార‌ణం డ్రింక్ అండ్ డ్రైవ్, అతి వేగం అని పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదం పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version