తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే తొలి ఘాట్ రోడ్డు వద్ద యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి తిరుమలకు వెళ్తున్న క్రమంలో ఘాట్ రోడ్డులోని 19వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొని పొదల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న మరికొందరు క్షేమంగా బయటపడ్డారు.ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.